CM Chandrababu : టీడీపీ ఆఫీస్ కు బాబు రాకతో అర్జీలతో తరలి వచ్చిన జనం
కాగా... గత నెల జూలై 17 నుంచి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం మొదలైంది...
CM Chandrababu : ప్రజా సమస్యలను వినేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) శనివారం ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు, పార్టీ శ్రేణుల నుంచి అర్జీలను సీఎం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. ముందుగా దివ్యాంగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కాగా.. టీడీపీ శ్రేణులు గడిచిన 50 రోజులుగా 10 వేలకుపైగా అర్జీలు తీసుకున్నారు.
CM Chandrababu Visited
కాగా… గత నెల జూలై 17 నుంచి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం మొదలైంది. ప్రతీరోజు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశంనేతలు ప్రజా సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈమేరకు టీడీపీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ కార్యాలయంలో తప్పనిసరిగా మంత్రులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల, ప్రజల కోసం కేంద్ర కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. 10 రోజులు పాటు రోజుకో మంత్రి , ఒక సీనియర్ టీడీపీ నేత అందుబాటులో ఉండే విధంగా అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే.
Also Read : Buddha Venkanna : పదవి లేక ఏమీ చేయలేక పోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్ధ