CM Chandrababu : మాజీ సీఎం జగన్ పై భగ్గుమన్న సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తెచ్చారని ఆరోపించారు...
CM Chandrababu : రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు డేగకన్ను వేశామని తెలిపారు.డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏపీలో ల్యాండ్, శాండ్, డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తామన్నారు. పిల్లల భవిష్యత్‌కు డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమని సీఎం చంద్రబాబు(CM Chandrababu) చెప్పారు. అనంతపురం జిల్లాలో ఇవాళ(శనివారం) సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించారు. నెమకల్లులో పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గం, నేమకల్లులో “ప్రజా వేదిక – పేదల సేవలో” కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu Slams..
వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తెచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోమని అన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
‘‘నేమకల్లు ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఏపీని అభివృద్ధి చేస్తా. ల్యాండ్, శాండ్, గంజాయి, రేషన్ బియ్యం మాఫియాలను ఉక్కుపాదంతో అణిచివేస్తా. జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసం సాగింది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏపీపై రూ. 10లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇష్టానుసారం అప్పుల పాలు చేసి.. ఏపీని దివాలా తీయించారు. ఈనెల వేతనాలు ఇస్తామా అనే భయం కలుగుతోంది. అయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. భూకబ్జాదారులను ఉపేక్షించేది లేదు. బెల్టు షాపులు పెడితే నేను కూడా బెల్టు తీస్తా. గతంలో ఇసుక మాఫియాతో వేల కోట్లు దోపిడీ చేశారు. మీరు ఇసుక తీసుకెళ్లేటప్పుడు అడ్డుకుంటే తిరగబడండి. ఎక్కడ ఇసుక దొరికినా స్వేచ్ఛగా తీసుకెళ్లండి. విశాఖను వైసీపీ ప్రభుత్వం గంజాయి రాజధానిగా మార్చారు. గంజాయి విక్రయించే వారికి అదే చివరి రోజు’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read : Gone Prakash : ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే ‘గోనె ప్రకాష్’