CM Chandrababu Naidu : జగన్ సర్కార్ రేషన్ బియ్యం డోర్ డెలివరీ స్కీమ్ లో 1800 కోట్ల అవినీతి

రేషన్ డిపోల్లో గతంలో రకరకాల నిత్యావసరాలు అందించామని తెలిపారు...

CM Chandrababu Naidu : వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేత ద్వారంపూడి కుటంబం రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రూ.1800 కోట్లు ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి మరీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాల్లోనే బియ్యం రీ-సైక్లింగ్ చేశారని చెప్పారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు పదవులు తెచ్చుకుని.. రేషన్ బియ్యం మాఫియాకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సి ఉంటుందని చెప్పారు. సోమవారం నాడు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) పలు కీలక విషయాలపై కలెక్టర్లను ప్రశ్నించారు.

CM Chandrababu Naidu Comment

రేషన్ డిపోల్లో గతంలో రకరకాల నిత్యావసరాలు అందించామని తెలిపారు. వివిధ శాఖలపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చంద్రబాబు కీలక సూచనలు ఇచ్చారు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక జేసీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో చాలా కాలంగా ఉన్న విధానం మంచిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో డబ్బులు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండకూడదన్నారు. రైతు సంక్షేమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. మిల్లెట్లను ప్రమోట్ చేయాలన్నారు.

ప్రతి జిల్లా కలెక్టర్‌ ద్రవ్యోల్భణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధరలు పెరగకూడదనే గతంలో రైతు బజార్లు ఏర్పాటు చేశారని చెప్పారు. రైతు బజార్లు ధరల నియంత్రణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో జేసీని పెట్టాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపామని అన్నారు. రజక వర్గాన్ని తొలిసారిగా అసెంబ్లీకి తెచ్చామని వివరించారు. అరకు కాఫీ బ్రాండ్‌ను మరింతగా వర్కవుట్ చేయాలని తెలిపారు. అరకు కాఫీ బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేస్తే.. ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కుల వృత్తులు చేసుకునే వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ అందించాలని ఆదేశించారు. కుల వృత్తుల్లోకి వేర్వేరు కులాలు వారు వచ్చేస్తున్నారని తెలిపారు. బీసీలకు ఎకనామిక్ యాక్టివిటీని లింక్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Also Read : Supreme Court : ఏపీ సీఎం చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!