CM Chandrababu Naidu : జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరిన సీఎం చంద్రబాబు

చివరకు అమర్‌రాజా హైదరాబాద్‌కు వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు...

CM Chandrababu Naidu : ‘దమ్ముంటే అసెంబ్లీకి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan)కి .. ఏపీ సీఎం నారా చద్రబాబు నాయడు(CM Chardrababu Naidu) సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నేతల ఆదాయం వందల వేల లక్షల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే.. పాలన మారితే మళ్లీ పీకపై కత్తిపెడతానని పారిశ్రామిక వేత్తలను మాజీ సీఎం జగన్ బయపెడుతున్నారని సీఎం చంద్రబాబు(CM Chardrababu Naidu) విమర్శించారు.

CM Chandrababu Naidu Slams

చివరకు అమర్‌రాజా హైదరాబాద్‌కు వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. లూలూ షాపింగ్ మాల్‌ను తాను ఎన్నో ఇబ్బందులు పడి తీసుకువస్తే గత పాలకులు వెళ్లిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శ్వేతప్రతాలు పెడితే చర్చించడానికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని జగన్‌(YS Jagan)కు చంద్రబాబు(CM Chardrababu Naidu) సవాల్ విసిరారు. వినుకొండ ఘటనలో ఇద్దరు వైసీపీ నేతలేనని స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం 36మంది ఉన్నారని ఆరోపిస్తున్నారని ధైర్యం ఉంటే వారి పేర్లు ఇవ్వాలని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తమ పార్టీ నేతలైనా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హత్యలు చేసిన వారిని వదిలి పెట్టం వడ్డీతో సహ చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

‘‘నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం.. రాజకీయ ముసుగులో దాగనివ్వం. జగన్ మాట్లాడితే రూ.2 లక్షల 71 వేల కోట్లు బటన్ నొక్కానని అంటారు. మీరు రూ.9 లక్షల 74 వేల కోట్లు అప్పు ఏపీ కోసం తెచ్చానని చెప్పి ఏం చేశారో చెప్పాలి. మద్యపాన నిషేధమని ఎవ్వరు చెప్పారు నేను చెప్పానా మీరు చెప్పారు. మద్యంపై భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. విశాఖ రాజధాని అని చెప్పి అక్కడి ఆస్తులను కూడా తాకట్టు పెట్టారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో 22 ఏ ఫైళ్లు తగలబెడితే అది అగ్ని ప్రమాదం అంటారా..? దాన్ని విచారణ చేయిస్తే తప్పా. మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అంటే నమ్మాలా..? చివరకు మీరే చంపారు అంటే ఒప్పుకోవాలా..? తర్వాత ఆదినారాయణ రెడ్డి చంపేశారు అన్నారు.

ముచ్చుమర్రిలో తప్పుచేసిన వారిని వదిలి పెట్టమని చూపించాం. రైతుల ఆదాయం తగ్గిపోయింది. దేశంలోనే ఎక్కువ అప్పు ఉన్న రైతులు రాష్ట్రంలో ఉన్నారు. త్వరగా ఆర్థిక వ్యవస్థను రివైవ్ చేస్తాం. ఎమ్మెల్యేలు ఒక రోడ్డు వేసుకోవాలంటే ఇవ్వలేని పరిస్థితి ఏపీలో ఉంది. నేను సీఎంగా ఉన్న నాలుగు టర్మ్‌లలో ఇలాంటి పరిస్థితి లేదు.. వైసీపీ పాలనలో వచ్చింది’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వినుకొండ ఘటనలో చంపినవారు ఎవరు..?.. చచ్చిపోయిన వారు ఎవరు..? నీకు సిగ్గుందా..? రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తావా…? ఆ ముసుగు తీస్తాం..?మీ బాబాయ్‌(Babai)ని ఎవరు చంపాడో బయటకు తీయాలి. మాకు బాధ్యత ఉంది.. తప్పనిసరిగా బయటకు తీస్తాం. 36 మందిని చంపారని మేము చంపామని అన్నావ్…? వాళ్ల పేర్లు చెప్పండి. అందులో నిజం ఉంటే నేను చర్యలు తీసుకుంటాం. అప్పుల గురించి అబద్ధాలు చెప్పారు. రూ. 2 లక్షల 75 వేల కోట్లు బటన్ నొక్కి వేశామని చెప్పారు. మరి మిగతా డబ్బులు ఎక్కడ..? రూ. 9 లక్షల 73 వేల కోట్లు అప్పు మీ హయాంలో ఎలా జరిగింది..?

మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం ఎలా జరిగింది..? అది అగ్నిప్రమాదమని జగన్(YS Jagan) అబద్ధాలు చెబుతున్నారు. మీ బాబాయ్‌(Babai)ని మర్డర్ చేశారు…? అది ఆత్మహత్య అని మీరు చెబితే మేము నమ్మాలా..? 36 రాజకీయ హత్యలకు FIRలు ఇవ్వండి. మీ అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పే స్థాయి నాది కాదు. కానీ నిజాన్ని చెప్పాల్సి వచ్చింది. రికార్డ్‌లను కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ సమయంలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవరో చేసిన తప్పుకు మనం ఫలితం అనుభవిస్తున్నాం. ఎమ్మెల్యేలు వచ్చి ఒక రోడ్డు అడిగితే ఇవ్వలేని పరిస్థితి. నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎప్పుడు ఇలా చేయలేదు. వినుకొండలో హతుడు మొన్నటివరకు మీ పార్టీలోనే ఉన్నారు కదా..?.. ఎవరికి తెలియదు….మీ పార్టీ వాళ్లు చంపుకుంటే దానికి రాజకీయ ముసుగు తగిలించారు’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : High Alert in Jammu : జమ్మూలో అనుమానాస్పద వ్యక్తుల కలకలం.. హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!