CM Chandrababu Naidu : ఎన్టీఆర్ ట్రస్టు భవనానికి చేరుకున్న సీఎం చంద్రబాబు
టీటీడీపీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు...
CM Chandrababu Naidu : తెలంగాణ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారనే చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై నాయకులకు స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం జరగనున్న పార్టీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌కి వచ్చిన ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉంటున్నారు. కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్రబాబు(CM Chandrababu Naidu) బయల్దేరి వెళ్తారు. అక్కడ టీటీడీపీ నేతలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ సభ్వత్వ కార్యక్రమాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు. పార్టీని నడిపే నేత లేకపోవడంతో ప్రస్తుతం నేతలు, కార్యకర్తలంతా స్తబ్ధుగా ఉన్నారు. కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటారని బాబు నేతల అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
CM Chandrababu Naidu Visit
టీటీడీపీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరమే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక చేస్తారని అంతా భావించారు. ఇదే అంశంపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మరోసారి చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ తరహాలోనే కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇకపై ప్రతినెలలో రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని బాబు చెప్పిన విషయం తెలిసిందే.
Also Read : PM Modi : మహిళలపై నేరాలు చేస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి