CM Chandrababu : చైనా లో ఉండే త్రీ జార్జెట్ డ్యామ్ కంటే ఎత్తైనది పోలవరం ప్రాజెక్టు

ఇక, పోలవరం ప్రాజెక్టులో వైసీపీ చేసిన పనులను తీవ్రంగా విమర్శించారు...

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి జీవనాడిగా, అమరావతిని రెండు కళ్లుగా పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి నీటి సమస్యలు సమర్థంగా పరిష్కారమవుతాయని, ఇది రాష్ట్రానికి “లైఫ్ లైన్”గా మారుతుందని తెలిపారు.

CM Chandrababu Comments..

గొల్లపల్లి, బనకచర్ల ప్రాంతాలను మూడు దశల్లో అనుసంధానం చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి ఏర్పడతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు చైనాలోని త్రీ జార్జెస్ డ్యామ్ కంటే ఎత్తులో మి.గా ఉందని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. 2014లో తెలంగాణలోని ఏడు మండలాలు పోలవరం ప్రాజెక్టులో భాగం కావడానికి కేంద్రం ఒప్పుకున్నట్లు, అప్పటివి కాంట్రాక్టర్ బావర్ సంస్థ 460 కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రం వాల్ నిర్మించిందని, 72 శాతం పనులు తమ ప్రభుత్వమే చేశామని తెలిపారు.

ఇక, పోలవరం ప్రాజెక్టులో వైసీపీ చేసిన పనులను తీవ్రంగా విమర్శించారు. “రివర్స్ టెండరింగ్” పేరుతో అప్పటి కాంట్రాక్టర్‌ను మారుస్తూ ప్రాజెక్టు పక్కకు పెట్టారని, దుర్మార్గంగా ఆ పనిని అడ్డుకున్నారని ఆరోపించారు. వారి అవినీతి, అనుభవహీనత కారణంగా ప్రాజెక్టు పూర్తవకుండానే నాశనం అయ్యిందని ఆయన చెప్పారు. 2020లో కాపర్ డ్యామ్ గ్యాప్‌ను కట్టకపోవడం వల్ల వరద కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినిందని, ఈ మరమ్మతులకు అదనంగా రూ.2400 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. కేంద్రం పోలవరం కోసం మంజూరు చేసిన రూ.12,150 కోట్లలో సివిల్ వర్క్స్ 71.3 శాతం తమ ప్రభుత్వం పూర్తి చేసింది.

పోలవరం ప్రాజెక్టును 2026 చివరివరకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నామని, వచ్చే జనవరి 2న డయాఫ్రం వాల్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 2026 మార్చి నాటికి రివర్స్ డెడ్ లైన్‌తో ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, ప్రాజెక్టు పూర్తి కాకపోతే రూ.15,000 కోట్ల నష్టం జరిగిపోయిందని చెప్పారు. 2019 తర్వాత కూడా టీడీపీ అధికారంలో ఉంటే, 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అని చెప్పిన చంద్రబాబు, “వీరు చేసిన విధ్వంసం కారణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద పడింది” అన్నారు. ప్రాజెక్టు పనులు 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామని, రివర్స్ టెండరింగ్ కారణంగా అప్పటి అవినీతి వలన ప్రాజెక్టు వాయిదా పడిందని, ప్రజలు ఇచ్చిన 11 సీట్ల ద్వారా వారికి శిక్ష ఇచ్చినట్లు చెప్పారు.

Also Read : Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని భార్య కేసు విచారణ వాయిదా వేసిన కోర్టు

Leave A Reply

Your Email Id will not be published!