CM Chandrababu : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
నలభై ఏళ్ల క్రితం పాత రోజులు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయని చెప్పారు...
CM Chandrababu : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెంటిల్ మ్యాన్‌కు ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారని గుర్తుచేశారు. నలభై ఏళ్ల క్రితం పాత రోజులు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. సాధారణ వ్యక్తి జాతీయ స్థాయికి ఎదగడం మాములు విషయం కాదని ఉద్ఘాటించారు. దత్తాత్రేయది పేరుకు హిందుత్వం… మతం భారతీయమని వ్యాఖ్యానించారు. అలయ్ బలయ్ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారు. దత్తాత్రేయ కోరుకున్నది జనహితం… ఆయనది లౌకికవాదమని కొనియాడారు. లేఖలు రాయడంలో దత్తాత్రేయ అంబాసిడర్‌గా నిలిచారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రశంసించారు.
CM Chandrababu Praises
గౌలీగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ఎదిగారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. జాతీయ స్థాయిలో వాజ్‌పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడినా ఎప్పుడూ వాజ్‌పేయికి గౌరవం తగ్గలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ (ఆదివారం) జరిగింది. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దత్తాత్రేయ పుస్తకం రచించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్క్ష్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ మంత్రి సత్యకుమార్, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ రచించారని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ… సిద్ధాంతాలు ముఖ్యమని ఉద్ఘాటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాజకీయ విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని చెప్పారు. అసభ్యంగా మాట్లాడే వారికి ఎన్నికల్లో సరైన జవాబివ్వాలని వెంకయ్యనాయుడు తెలిపారు.
Also Read : MLA Adluri Laxman Kumar : మొదటిసారి ఎమ్మెల్యే అడ్లూరి..ఇప్పుడు మంత్రి పదవి కూడా..
