CM Chandrababu Slams : గత పాలకులు ఏపీని శ్రీలంక స్థితికి తీసుకొచ్చారు
ఆర్థిక పరిస్థితి చూసి.. ఆ రాష్ట్ర పరిస్థితి చెప్పగలం...
CM Chandrababu : ఏపీలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ(YSRCP) ఆర్థిక విధ్వంసానికి నీతి అయోగ్ నివేదికే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని తెలిపారు. ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో నీతి ఆయోగ్ నివేదికపై చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. నాయకుల సమర్థత ఆధారంగా ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. నాయకుల అసమర్థత, తెలియని తనం వలన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని చెప్పారు.
CM Chandrababu Slams YSRCP..
నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అనేది వివరించిందని తెలిపారు. 2014-2015 నుంచి 2022-2023 వరకు ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ సమీక్షించిందని అన్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌లో ఏపీ చివరిలో ఉందని నీతి ఆయాగ్ చెప్పిందని గుర్తుచేశారు. ఏపీకి కనీసం అప్పు తీసుకునే అర్హత కూడా లేకుండా జగన్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. కనీసం చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్‌లో ఏపీ చివరిలో ఉందన్నారు. అభివృద్ధి పనులపై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అప్పు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని చెప్పారు. పన్నులు పెరుగుతాయి, అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియదని సీఎం చంద్రబాబు అన్నారు.
‘‘ఆర్థిక పరిస్థితి చూసి.. ఆ రాష్ట్ర పరిస్థితి చెప్పగలం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే సంక్షేమం, అభివృద్ధి. ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి.. సంక్షేమానికి డబ్బు కేటాయించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవు. నాయకుల సమర్థతపై ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కనీసం అప్పు తీసుకునే అర్హత లేకుండా గత ప్రభుత్వం చేసింది. చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియక విధ్వంసం సృష్టించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టారు. వైసీపీ పాలనలో వృద్ధి రేటు సగానికి పైగా పడిపోయింది’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
‘‘అప్పులు తెచ్చి జల్సాలు చేశారు.. ఆదాయం ఎలా పెరుగుతుంది. గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియదు. మంచి రాష్ట్రాన్ని ఆర్ధిక ఇబ్బందుల్లోకి పడేశారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అప్పులు తెచ్చి ఏం చేశారో తెలియదు. అభివృద్ధి చేస్తేనే ఆదాయం పెరుగుతుంది.. సంక్షేమానికి డబ్బులు వస్తాయి. తెచ్చిన అప్పులో కనీసం 50శాతం క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌కు పెట్టాలి. వైసీపీ హయాంలో అప్పు తెచ్చి వడ్డీలు కట్టారు. గత ఐదేళ్లలో కమిటెడ్ ఎక్సపెండీచర్ 11.6శాతానికి చేరింది. స్టేట్ ఓన్ రివెన్యూ గ్రోత్ రేట్ పడిపోతూ వస్తోంది. అప్పు తీర్చలేని పరిస్థితికి తెచ్చారు. ఏపీని శ్రీలంక చేస్తున్నారని అప్పుడే చెప్పాను’’ అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Waqf Board Bill : ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం..విపక్షాలకు తిరస్కరణ