CM Chandrababu : గుంటూరు రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై స్పందించిన సీఎం
ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు...
CM Chandrababu : గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం వ్యక్తం చేశారు.కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
CM Chandrababu Comment
గుంటూరుజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి… బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : లింగా..ఓ లింగా అనే నామస్మరణతో మొదలైన పెద్దగుట్ట జాతర