CM Chandrababu : పరవాడ లో మరో ఫార్మా కంపెనీ ప్రమాదంపై స్పందించిన సీఎం

వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు...

CM Chandrababu : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో నిన్న(మంగళవారం) అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఠాగూర్‌ లేబొరేటరీస్‌లో విషవాయువు లీక్‌ అవడంతో ఒడిశా కార్మికుడు మృతి చెందగా, మరో 9 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

CM Chandrababu Comment

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని… వారిని క్రిటికల్ కేర్‌ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులుకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Also Read : TG Govt : మూసి రివర్ డెవలప్మెంట్ పై పార్లమెంట్ లో ప్రస్తావించిన తెలంగాణ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!