CM Chandrababu : నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు లో సీఎం చంద్రబాబు పర్యటన

10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‏ను ఆయన పరిశీలించనున్నారు...

CM Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జీడీ నెల్లూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి, ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి చేతిపై పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‏ను ఆయన పరిశీలించనున్నారు.

CM Chandrababu Today Plans

అలాగే, రామానాయుడుపల్లిలో జరగనున్న ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణకు సీఎం అభిరుచిని, అధికార యంత్రాంగం, కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ముఖ్యమంత్రి ఈ పర్యటనలో ప్రజలకు సేవలు అందించే పనుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి, జిల్లా అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

Also Read : Champions Trophy 2025 :16 ఏళ్ల తర్వాత మొదటిసారి సెమీస్ కు చేరిన ఆస్ట్రేలియా

Leave A Reply

Your Email Id will not be published!