CM Chandrababu : మాజీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌ వేదికగా జగన్‌కు శుభాకాంక్షలు తెలియాజేశారు...

CM Chandrababu : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా జగన్‌‌కు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ పుట్టిన రోజు సందర్భాల్లో ఒకరికిఒకరు విషెష్‌ చెప్పుకోవడం రాజకీయాల్లో కామన్. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu)కూడా జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య ఎంతటి వైరం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. నువ్వా – నేనా అన్న రీతిలో చంద్రబాబు, జగన్ తలపడుతున్న పరిస్థితి. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే చంద్రబాబుతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ కూడా మాజీ ముఖ్యమంత్రికి బర్త్‌డే విషెష్ తెలియజేశారు.

CM Chandrababu Wishes

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌ వేదికగా జగన్‌కు శుభాకాంక్షలు తెలియాజేశారు. జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సీఎం. సంపూర్ణ ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
అలాగేజగన్‌కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌కు విషెష్ తెలిపారు. ‘‘ ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్సును ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. సుదీర్ఘంగా ప్రజా సేవలో జగన్ ఉండాలి’’ అని ఆకాంక్షిస్తూ గవర్నర్ నజీర్ పోస్టు చేశారు.

Also Read : MLA KTR : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!