Sabitha Indra Reddy : సీఎం పాలన భేష్ యువత ఖుష్ – సబిత
1500 కంపెనీలు వేలాది మందికి జాబ్స్
Sabitha Indra Reddy : సీఎం కేసీఆర్ పాలన అద్బుతంగా ఉందని, ఆయన చేసిన కృషి వల్లనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది చెందుతోందని అన్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పూర్తి పారద్శకంగా కొనసాగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి 1,500 కంపెనీలు వచ్చాయని చెప్పారు.
ఈ కంపెనీలలో వేలాది మందికి ఉపాధి లభించిందన్నారు. ఉన్నత విద్యను చదువుతున్న వారంతా ఇప్పుడు తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారని చెప్పారు మంత్రి. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. కానీ కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ కొత్త ప్రభుత్వం పరుగులు తీస్తోందన్నారు. ఎక్కడా ఒక్క సమస్య కూడా లేదన్నారు. యావత్ ప్రపంచం తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి విస్తు పోతోందన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy). మూస పద్దతిలో కాకుండా డిమాండ్ ఉన్న కోర్సులను విద్యార్థులు ఎంచు కోవాలని కోరారు. ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ది కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనే వాళ్లని..కానీ సీన్ మారిందన్నారు.
ఇప్పుడు ఎవరు చూసినా హైదరాబాద్ జపం చేస్తున్నారని ఇదంతా సీఎం కేసీఆర్ కృషి వల్లనే జరిగిందన్నారు మంత్రి. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వందల కంపెనీలలో 7 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు.
Also Read : కవిత కామెంట్స్ రాములమ్మ సీరియస్