KCR Blessings : మనవడిని ఆశీర్వదించిన కేసీఆర్
సమాజ సేవకు అంకితం కావాలి
KCR Blessings : తన చేతుల్లో పెరిగిన తన మనవడు మంత్రి కేటీఆర్ తనయుడు హిమాంశు రావును ఆశీర్వదించారు తాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR Blessings). ఉన్నత చదువులు చదవాలని, పది మందికి ఆదర్శ ప్రాయం కావాలని కోరారు. సమాజ సేవలో నిమగ్నం కావాలని సూచించారు.
12వ క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు హిమాంశు రావు. ఈ సందర్భంగా తన తాత, నాయనమ్మ, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. గచ్చి బౌలి లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ లో చదువు పూర్తి చేసుకున్నాడు హిమాంశు రావు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇదిలా ఉండగా చదువుకుంటూనే ఆటలు, సాంస్కృతిక, సామాజిక సేవ వంటి తదితర రంగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసింది యాజమాన్యం. ఇందులో భాగంగా కేటీఆర్ తనయుడు హిమాంశు రావు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో టాప్ లో నిలిచాడు. అతడికి సర్టిఫికెట్ ప్రధానం చేసింది. తన ఆశీస్సులు తీసుకున్న మనవడిని హత్తుకున్నారు సీఎం కేసీఆర్.
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ , కేటీఆర్, తనయుడు హిమాంశు రావు కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.
Also Read : తెలంగాణ సర్కార్ పై జంగు సైరన్