CM KCR : 4న కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ
CM KCR : హైదరాబాద్ – ఎన్నికలు ముగిశాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల మధ్య బిగ్ ఫైట్ కొనసాగింది. ఇరు పార్టీలు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
CM KCR Meeting on 4th
ఇదిలా ఉండగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఉదయం 9.30 గంటల వరకు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
విచిత్రం ఏమిటంటే ఓ వైపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కాంగ్రెస్ పక్షం వహించాయి. ఆ పార్టీ పవర్ లోకి వస్తుందని కుండ బద్దలు కొట్టాయి. ఇదిలా ఉండగా విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ ఈనెల 4న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన కీలక మీటింగ్ జరగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్(CM KCR) తో పాటు మంత్రి కేటీఆర్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మంత్రులలో కొందరు మినహా మిగతా వాళ్లంతా ఓటమి పాలు కాబోతున్నారంటూ ప్రకటించాయిన ఎగ్జిట్ పోల్స్.
Also Read : Revanth Reddy : ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు