CM KCR Comment : అంతు చిక్క‌ని పజిల్ ‘కేసీఆర్’

పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న నేత

CM KCR Comment : భార‌త దేశ రాజ‌కీయాల‌లో కేసీఆర్ ఒక పేజీ. రాద‌నుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మించిన నాయ‌కుడు. భావ సారూప్య‌త క‌లిగిన వారితో క‌లిసి క‌ల సాకారం కోసం ప్ర‌య‌త్నం చేసిన రాజ‌కీయ వేత్త‌. క‌వి, ర‌చ‌యిత‌, వ‌క్త‌, బ‌హు భాషల్లో ప‌ట్టు క‌లిగిన వ్య‌క్తి. అంతే కాదు అన‌ర్ఘ‌లంగా ఏ విష‌య‌మైనా , ఏ అంశ‌మైనా పొల్లు పోకుండా చెప్ప‌గ‌ల ధార‌ణా శ‌క్తి కేసీఆర్ స్వంతం.

ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. ఇప్పుడు 68 ఏళ్లు. ఫిబ్ర‌వ‌రి 17, 1954లో పుట్టిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు(CM KCR Comment) అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టారు. స‌వాళ్లు విస‌రడం వాటిని ఆచ‌ర‌ణాత్మ‌కంగా చేసి చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. కేసీఆర్ పేరుకు మూడు అక్ష‌రాలైనా ఓ ప‌వ‌ర్ . విస్మ‌రించ లేని ప‌దం. 

ఎమ్మెల్యేగా , డిప్యూటీ స్పీక‌ర్ గా, కేంద్ర మంత్రిగా , సీఎంగా ఇలా ఏ ప‌ద‌వి నిర్వ‌హించినా స‌రే దాని ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డం కేసీఆర్ ప్ర‌త్యేక‌త‌. భోజ‌న ప్రియుడు..ఆపై ఆతిథ్యం ఇవ్వ‌డంలో మెస్మ‌రైజ్ చేయ‌డం కేసీఆర్ నైజం.

సాహిత్యం ప‌ట్ల మ‌క్కువ కూడా ఎక్కువే. గాయ‌కుడు కూడా. ఆద‌రించ‌డంలో ఎంత స్పీడ్ గా ఉంటారో అంత‌లోపే కొంత కోపాన్ని కూడా ప్ర‌ద‌ర్శిస్తార‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు. ఇది ప‌క్క‌న పెడితే ఇవాళ దేశంలో ఒక చ‌ర్చ‌కు దారి తీసేలా మారి పోయారు. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు కేసీఆర్.

ఈ దేశంలో మోస్ట్ పాపులారిటీ ఎలా సంపాదించాలో తెలుసు కోవాలంటే ప్ర‌ధాన మంత్రి మోదీని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటారు. వాళ్ల‌ను మించిన మార్కెటింగ్ స్ట్రాట‌జిస్ట్ లు ఎవ‌రూ లేరు. 

మొద‌ట ఉద్య‌మం పేరుతో ముందుకు వ‌చ్చారు.  ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మాన్ని పార్టీగా మార్చారు. అక్క‌డి నుంచి ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. రెండోసారి రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక‌య్యారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పుడు కేసీఆర్(CM KCR Comment) దేశంపై ఫోక‌స్ పెట్టారు. 

బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు. ఆయ‌న ఏది చేసినా లేక ఏది మాట్లాడినా సంచ‌ల‌న‌మే. కేసీఆర్ ను దార్శ‌నికుడు అన్న వాళ్లు ఉన్నారు..అదే స‌మ‌యంలో విమ‌ర్శిస్తున్న వాళ్లు లేక పోలేదు. రాజ‌కీయంగా ఎన్నో వైరుధ్యాలు, అభిప్రాయ భేదాలు ఉన్నా కేసీఆర్ ఎవ‌రినీ న‌మ్మ‌డు. 

ఒక్కోసారి త‌న నీడ‌ను కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డ‌నే ప్ర‌చారం కూడా ఉంది. అప‌ర భ‌క్తుడైనా న‌ర న‌రాన రాజ‌కీయాల‌ను వంట బ‌ట్టించుకున్నారు. ఈ చ‌ద‌రంగపు క్రీడ‌లో ఏ పావును ఎప్పుడు క‌ద‌పాలో కేసీఆర్ కు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌దు. 

కాలం కంటే వేగంగా ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ కంటే భిన్నంగా ఆలోచించే సీఎం ను అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. ఒక ర‌కంగా ఏది ఏమైనా అంతు చిక్క‌ని ప‌జిల్ కేసీఆర్.

Also Read : సీజేఐ సీరియ‌స్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!