CM KCR Comment : ‘సింహం’ గెలుస్తుందా నిలుస్తుందా

సీఎం కేసీఆర్ కు అగ్నిప‌రీక్ష

CM KCR Comment : భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఎదురు లేని నాయ‌కుడు. ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌కుండా, ఎవ్వ‌రికీ చిక్క‌కుండా అసాధార‌ణ‌మైన విజ‌యాల‌ను సాధించిన వాడు. ఉద్య‌మ నేత‌గా వినుతికెక్కి రాద‌నుకున్న తెలంగాణ‌ను తీసుకువ‌చ్చి క‌ళ్ల ముందు అభివృద్ది ఫ‌లాలను అందించిన డైన‌మిక్ లీడ‌ర్ బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్(KCR) తీవ్ర‌మైన అగ్ని ప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో అలుపెరుగ‌ని పోరాటాల‌ను న‌డిపిన ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన యోధుడిగా గుర్తింపు పొందారు. భావ సారూప్య‌త క‌లిగిన నేత‌ల‌ను, పార్టీల‌ను ఒకే చోటుకు చేర్చ‌డంలో స‌క్సెస్ అయిన కేసీఆర్ ఇప్పుడు తీవ్ర‌మైన పోటీని ఎదుర్కొంటున్నారు. ఇది ఒక ర‌కంగా త‌న ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితానికి ప‌రీక్ష లాంటింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి త‌ను ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కాల‌ని కోరుకుంటున్నారు.

CM KCR Comment Viral

ఇందుకోసం విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామి ఆధ్వ‌ర్యంలో రాజ శ్యామ‌లా యాగం కూడా చేప‌ట్టారు త‌న ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో. ఇదే స‌మ‌యంలో తాను న‌మ్ముకున్న యాద‌గిరి ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి, గ‌జ్వేల్ లోని ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. యాగాలు, పూజ‌లలో మునిగి పోయారు. ఏది ఏమైనా గ‌తంలో కంటే ఇప్పుడు కేసీఆర్(KCR) గ‌ట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు త‌ను న‌మ్ముకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు మేడిగ‌డ్డ బ్యారేజ్ కుంగి పోవ‌డం అడ్డంకిగా మారింది. పార్టీ ప‌రంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై చోటు చేసుకున్న అవినీతి ఆరోప‌ణ‌లు అడ్డంకిగా మారాయి. ఇదే స‌మయంలో త‌న స్వంత కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఢిల్లీ లిక్క‌ర్ స్కాం, ఖాకీల దౌర్జ‌న్యాలు, భూ క‌బ్జాలు, ఉన్న‌తాధికారుల వేధింపులు, రిటైర్డ్ అధికారుల ఆధిప‌త్యం వెర‌సి స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు కేసీఆర్ ను చుట్టు ముడుతున్నాయి.

తాను ఉన్నంత వ‌ర‌కు తానే సీఎంనంటూ ప్ర‌క‌టించారు . కానీ ఉన్న‌ట్టుండి త‌న త‌న‌యుడు కేటీఆర్ ను సీఎం చేయాల‌ని కోరిక‌. ప్ర‌స్తుతం స‌ర్వేల‌న్నీ బీఆర్ఎస్ వైపు ఉన్న‌ప్ప‌టికీ తాను ఈసారి రెండు చోట్ల బ‌రిలో ఉండ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఇందులో ఒక‌టి గ‌జ్వేల్ కాగా రెండోది కామారెడ్డి. ఈ రెండింట్లో వ్యూహాత్మ‌కంగా ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ ను టార్గెట్ చేశాయి. గ‌జ్వేల్ వేదిక‌గా ఉద్య‌మ నేత‌, తాను వెళ్ల‌గొట్టిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో ఉండ‌గా కామారెడ్డిలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై బ‌య‌ట‌కు వ‌చ్చిన రేవంత్ రెడ్డి ప్ర‌త్య‌ర్థిగా ఉన్నారు. దీంతో భారీ మెజారిటీ వ‌స్తుందా అన్న అనుమానం నెల‌కొంది పార్టీ శ్రేణులలో. ఇందుకు కార‌ణం ఎక్కువ‌గా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉండ‌డం. నిరుద్యోగుల ఆగ్ర‌హం ఒకింత ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండ‌గా కొడుకు కేటీఆర్ త‌న తండ్రి సింహం లాంటోడ‌ని , మ‌ళ్లీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీంతో మ‌రి ల‌య‌న్ గెలుస్తాడా లేక నిలుస్తాడా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దేశ వ్యాప్తంగా తెలంగాణ వైపు చూసేలా చేస్తోంది.

Also Read : Bandla Ganesh : తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు ప‌క్కా

Leave A Reply

Your Email Id will not be published!