CM KCR : మానుకోటకు కేసీఆర్ నజరానా
జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు
CM KCR : ఎన్నికల వేళ సీఎం కేసీఆర్(KCR) హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎవరు ఏది అడిగినా కాదనడం లేదు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. మహబూబాబ్ జిల్లాకు జేఎన్టీయూ అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి ఐదు రకాల ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా బ్రాంచ్ కు 60 మంది చొప్పున 300 మంది విద్యార్థులు చదువుకునేందుకు ఛాన్స్ దక్కుతుంది.
CM KCR New Schemes Announcing
వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ ను అన్ని రంగాలలో ముందంజలో తీసుకు వస్తానని గతంలో పలు మార్లు ప్రకటించారు. ఈ సందర్బంగా విద్యా పరంగా మరో కీలకమైన కాలేజీని మంజూరు చేయడం పట్ల రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు ఉండనే ఉన్నాయి. వీటి ద్వారా నాణ్యమైన విద్య పిల్లలకు దక్కేలా సర్కార్ కృషి చేస్తోందన్నారు సత్యవతి రాథోడ్. ఇప్పటికే హార్టికల్చర్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు సీఎం కేసీఆర్. తాజాగా మరో కీలక ప్రకటన చేయడంతో పట్టరాని ఆనందం వ్యక్తం చేసింది మంత్రి.
Also Read : PM Modi Manipur : శాంతితోనే సమస్యకు పరిష్కారం