CM KCR Opening : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవనాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మెయిన్ గేట్ వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అక్కడే కొనసాగుతున్న యాగశాలను సందర్శించారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం నూతన సెక్రటేరియట్ ను ప్రారంభిచారు.
శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి సీఎంకు స్వాగతం పలికారు. సచివాలయ ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్(CM KCR Opening) తనకు కేటాయించిన 6వ ఫ్లోర్ కు చేరుకున్నారు. అక్కడ సిద్దం చేసిన 6 ఫైళ్లపై సంతకం చేశారు. పోడు భూములపై హక్కు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.
అంతకుముందు విద్యుత్ వాహనంలో తన చాంబర్ కు చేరుకున్నారు. 1.31 గంటలకు చాంబర్ సీటులో ఆసీనులయ్యారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. మరికొందరు ఆయన కనుసన్నలలో పడేందుకు నానా తంటాలు పడ్డారు. మొత్తంగా ఇంధ్రభవనం లాంటి సచివాలయంలోకి సాధారణ ప్రజలకు చోటు ఉంటుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు బీఆర్కే భవన్ నుంచి పాలన సాగింది. అక్కడి నుంచి సామాన్లు, ఫైళ్లను కొత్త సెక్రటేరియేట్ కు తరలించారు.
Also Read : ఆరు అంతస్తులు ప్రభుత్వ శాఖలు