CM KCR : అధునాతన కూరగాయల మార్కెట్లు – సీఎం
ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు
CM KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో పూర్తవుతాయి. కీలకమైన బిల్లులకు మోక్షం కలగాల్సి ఉంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఇక అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గతంలో ఆరు లేదా ఏడు మార్కెట్లు మాత్రమే ఉండేవన్నారు. కానీ తాము వచ్చాక మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ ఇచ్చామన్నారు. శాస్త్రీయ బద్దంగా మార్కెట్లు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు సీఎం కేసీఆర్(CM KCR). ఆనాడు నిజాం నవాబు కట్టిన మొజాంజాహీ మోండా మార్కెట్ ను చూసి తాను విస్తు పోయానని చెప్పారు.
ప్రస్తుతం భాగ్యనగరంలో కోటి మందికి పైగా జనాభా ఉందని వీరికి అనుగుణంగా వెజ్ , నాన్ వెజ్ తినేందుకు కావాల్సిన మార్కెట్ లు లేవన్నారు. దీనిపై తాము ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ప్రధానంగా నగరంలో చాలా కూరగాయల మార్కెట్లు అనుకున్నంత పరిశుభ్రంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సమీకృత వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ల కు శ్రీకారం చుట్టామన్నారు. మోండా మార్కెట్ ను అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా చూపించామని చెప్పారు కేసీఆర్(CM KCR). 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్ ను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అంతే కాకుండా రాష్ట్రంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.
Also Read : ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్