CM KCR : ఎమ్మెల్యేలపై కన్నెర్ర నోరు జాగ్రత్త – కేసీఆర్
అందరినీ కలుపుకుని పోవాలి
CM KCR : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు నోరు జాగ్రత్తగా పెట్టు కోవాలని హెచ్చరించారు. సమాజంలో పార్టీ పరంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనితీరు మార్చు కోవాలని సూచించారు. ప్రధానంగా మాట్లాడేముందు ఆలోచించాలని స్పష్టం చేశారు కేసీఆర్.
CM KCR Comment
బి – ఫారమ్ లు నింపేటప్పుడు జాగ్రత్తగా నింపాలని కోరారు. ప్రధానంగా అప్ డేట్ అయిన ఎన్నికల జాబితాలో ఉన్న పేరును మాత్రమే నింపాలని పేర్కొన్నారు. ఇవాళ 51 మంది అభ్యర్థులకు బి ఫారమ్ లు ఇచ్చామన్నారు. రేపటి నుంచి మరికొందరికీ బి ఫారమ్ లు ఇస్తామని చెప్పారు కేసీఆర్(CM KCR).
సీట్లు రాక పోయిన వారికి తగిన రీతిలో సముచిత స్థానం ఇస్తామని తెలిపారు. టెక్నికల్ గా ఇష్యూస్ ఉన్న కారణంగా ఇక నుంచి జాగ్రత్తగా నింపాలని హెచ్చరించారు. 20 మందితో లీగల్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి మొబైల్ ఫోన్ ఏర్పాటు చేశామన్నారు. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.
తాను చెప్పినా వినిపించు కోలేదని అందుకే 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ప్రస్తావించారు. అసమ్మతి నేతలను సముదాయించాలని, వారి వద్దకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు ఉద్బోదించారు కేసీఆర్.
Also Read : BRS Slams : నోట్లు ఇచ్చినోళ్లకు సీట్లు ఇచ్చారు
