CM KCR Viral : సీఎం కేసీఆర్ వైర‌ల్

బ్రేక్ ఫాస్ట్ స్కీం హ‌ల్ చ‌ల్

CM KCR Viral : తెలంగాణ – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైర‌ల్ గా మారారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించారు. ఈ ప‌థ‌కానికి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ స్కీం వ‌ల్ల రాష్ట్రంలోని 25 ల‌క్ష‌ల మంది పేద విద్యార్థులు, పిల్ల‌లకు ల‌బ్ది చేకూరుతోంది.

CM KCR Viral Photos

ఇదే స‌మ‌యంలో ఈ స్కీం స్వ‌యంగా డిజైన్ చేశారు సీఎం కేసీఆర్. ఆయ‌న చిర‌కాల క‌ల‌. ఉద్య‌మ కాలంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో బ‌డుల దుస్థితి, విద్యార్థుల , పిల్ల‌లకు పౌష్టిక ఆహారం కూడా అంద‌క పోవ‌డాన్ని గుర్తించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత విద్యా, ఆరోగ్య ప‌రంగా చ‌ర్య‌లు చేపట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు కేసీఆర్(CM KCR). ఇందులో భాగంగా ఆయ‌న ఆలోచ‌న‌ల్లో వ‌చ్చిందే సీఎం అల్ప‌హారం. ఇదిలా ఉండ‌గా ఈమ‌ధ్య టెక్నాల‌జీ ప‌రంగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెద్ద ఎత్తున కేసీఆర్ కు సంబంధించిన ఫోటోల‌ను డిఫ‌రెంట్ గా త‌యారు చేశారు ఆయ‌న అభిమానులు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఏఐ కేసీఆర్ ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌ధానంగా తాజాగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీం కు సంబంధించిన ఫోటోలు ఆస‌క్తిని రేపుతున్నాయి.

Also Read : Palla Rajeswar Reddy : ముత్తిరెడ్డికి షాక్ ప‌ల్లాకు ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!