CM MK Stalin : ఉదయనిధి అన్న దాంట్లో తప్పేముంది
ఏ మతాన్ని కించ పర్చలేదని ప్రకటన
CM MK Stalin : చెన్నై – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తాజాగా తన తనయుడు , మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేశాయి. ఆయన ఏమన్నారంటే సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా కంటే ప్రమాదకరమని హెచ్చరించారు.
CM MK Stalin Comment
ఇవాళ బీజేపీ సీనియర్ నేతలు గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిశారు. వెంటనే ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. యూపీలోని అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య ఏకంగా ఉదయనిధి తలకు వెల కట్టారు. ఆయన తలను నరికి తీసుకు వస్తే రూ.10 కోట్లు ఇస్తానంటూ ప్రకటించారు.
బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇవాళ తీవ్రంగా స్పందించారు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin). ఏ మతాన్ని కించ పరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. తన తనయుడు చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సనాతన సూత్రాల్లోని వివక్షా పూరిత అంశాలకు వ్యతిరేకంగా ఉదయనిధి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటూ సీఎం స్పష్టం చేశారు.
బీజేపీ కావాలని దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. తగ్గించు కోవాలని సూచించారు.
Also Read : Tirumala Gokulastami : తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి