CM Omar Abdullah : మోదీ చీనాబ్ బ్రిడ్జి ఓపెనింగ్ పై కాశ్మీర్ సీఎం ప్రశంసలు
23 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి మోదీ దీనిని సాకారం చేసారు...
Omar Abdullah : శతాబ్దాల కలను నెరవేరుస్తూ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి చినాబ్ రైల్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) శుక్రవారంనాడు ప్రారంభించారు. కట్‌డా నుంచి కశ్మీర్‌కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా వంతెన అందుబాటులోకి వచ్చింది. బ్రిటిషర్ల కాలం నాటి ప్రణాళిక ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడంపై ప్రధాన మంత్రిపై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) ప్రశంసలు కురిపించారు. బ్రిటిషర్లు చేయలేని పని మోదీ చేశారని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒమర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రైన్ సర్వీస్ కోసం ఎందరో కలలు కన్నారని, బ్రిటిషర్లు ఆ పని చేయలేకపోయినప్పటికీ ప్రధాని దానిని పూర్తి చేశారని, ఇప్పుడు కశ్మీర్ లోయకు యావద్దేశంతో అనుసంధానం జరిగిందని అన్నారు.
Omar Abdullah Praises
ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింగ్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన చినాబ్ వంతెన మోడ్రన్ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. 1,315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలో ఎత్తైన ఐఫిల్ టవర్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. 2002లో అటర్ బిహార్ వాజ్‌పేయి హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. 23 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి మోదీ దీనిని సాకారం చేసారు.
చినాబ్ బ్రిడ్జి వంతెన ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని ఒమర్ అబ్దుల్లా పేర్కొంటూ, ఇందుకు గత నాయకులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటల్ బిహార్ వాజ్‌పేయి పేరును ఈ సందర్భంలో గుర్తుచేసుకోకుంటే తాను తప్పుచేసిన వాడినవుతానని, తాను 8వ తరగతిలో ఉన్నప్పుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని ఒమర్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన వయస్సు 55 ఏళ్లు అని, ఇప్పటికి ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా వాజ్‌పేయి హోదా ఇవ్వడం, బడ్జెట్‌ను పెంచడం వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైందని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ స్టేషన్ నుంచి బనిహాల్ టన్నెల్, కాత్రా స్టేషన్, ఇప్పుడు చినాబ్ బ్రిడ్జ్.. ఇలా ప్రతి కీలక ప్రాజెక్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాలుపంచుకునే అవకాశం కలగడం తన అదృష్టమని అన్నారు. ఈ వంతెన లాగానే పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణమవుతున్నాయని చెప్పారు. చినాబ్ రైల్వే బ్రిడ్జి అంటే కేవలం స్టీలు, కాంక్రీట్‌తో నిర్మితమైనదే కాదని, తరతరాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. వికసిత్ భారత్‌లో భాగంగా వికసిత్ జమ్మూకశ్మీర్ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని, జమ్మూకశ్మీర్ ప్రజల తరఫున ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
Also Read : NIA: జమ్మూకశ్మీర్‌లోని 32 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు ! ఉగ్రవాదుల ఆవాసాల లక్ష్యంగా దాడులు !
