CM Revanth : అక్రమ కట్టడాలను వదిలేది లేదంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం
అయితే, హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు...
CM Revanth : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది. కేవలం 42 రోజుల్లో చిన్న, పెద్ద భవనాలన్నీ కలిపి దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
CM Revanth Reddy Comment
తాజాగా శనివారం ఖానామెట్ గ్రామ పరిధిలో ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్. కన్వెన్షన్‌ను కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను అక్రమించే వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని వెల్లడించారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని అన్నారు. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి కోపాన్ని చూశామని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Also Read : Israel PM : తీవ్ర ఉద్రిక్తత సమయంలో సంచలన ప్రకటన చేసిన బెంజమాన్