CM Revanth Reddy : కాన్వాయ్ పేరుతో ఇబ్బందులు వద్దు
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనా పరంగా దూకుడు పెంచారు. ఎప్పటికప్పుడు ఆయన కీలకమైన శాఖలను జల్లెడ పడుతున్నారు. వెంట వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. దీంతో నిన్నటి దాకా పేలవంగా , నిస్తేజంగా ఉన్న సచివాలయం ఇప్పుడు కళ కళ లాడుతోంది.
CM Revanth Reddy Comment
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). సీఎం కాన్వాయ్ వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కూడదని ఆదేశించారు. ఈ మేరకు ఎవరూ చీదరించు కోకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా ట్రాఫిక్ రూల్స్ ఉండాలని పేర్కొన్నారు. తాను సీఎం అయినా సామాన్యుడినేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలకు బదులు 9 వాహనాలకే పరిమితం చేయాలన్నారు. తాను ప్రయాణం చేసే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి.
Also Read : Chenna Keshava Reddy : పోర్న్ పై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్
