CM Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ !
గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ !
CM Revanth Reddy: తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రూప్-1 అభ్యర్ధుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే భర్తీ చేపడతామని ఆయన శాసనసభలో ప్రకటించారు. ‘‘కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైంది. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం మేము కాదు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం మేము కాదు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారు. త్వరలోనే పోలీసు శాఖలో 15వేల ఉద్యోగ నియామకాలు చేపడతాం. యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుంది’’ అని సీఎం రేవంత్ శాసనసభలో తెలిపారు.
CM Revanth Reddy – పీవీకి ‘భారతరత్న’ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ దక్కడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పీవీ లాంటి గొప్ప వ్యక్తికి అత్యున్నత పురస్కారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం తెలంగాణ బిడ్డగా గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల తరఫున పీవీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
భరతమాత ముద్దుబిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్ లతో పాటు ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించటం అత్యంత సంతోషకరమన్నారు. ఈ ముగ్గురు భరతజాతి ముద్దుబిడ్డలకు భారతరత్న ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు.
దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి… భారత్‌ను అభివృద్ధి పథంవైపు పరుగులు తీయించిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు. బహుభాషా కోవిదుడు. మౌనంగానే సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారు. ఆర్థిక సంస్కరణలతో నూతన దశ దిశ కల్పించారు. ఆయన తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణం. ‘‘ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు’’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
‘‘పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ ప్రకటించడం తెలుగువారందరికీ గర్వకారణం. పండితుడు, నాయకుడు, ఆర్థికవేత్త, రచయిత, బహుభాషావేత్త, మానవతావాది అయిన పీవీ.. ‘భారతరత్న’కు అన్ని విధాలా అర్హులు. దేశం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గొప్పగా నిలబెట్టాయి. రాష్ట్రం, దేశం పట్ల ఆయన చూపిన దార్శనికత ఎందరికో ఆదర్శం’’ – టీడీపీ అధినేత చంద్రబాబు
Also Read : Nirmala Sitharaman : కాంగ్రెస్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసింది