CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేసిన సీఎం రేవంత్

సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy : శ్రీరామ నవమి పర్వదినం పురష్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి భద్రాది కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని… వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా భూరం శ్రీనివాసరావు అనే లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో కలిసి ఆయన భోజనం చేశారు. ముందుగా రేవంత్ రెడ్డికి స్థానిక మహిళలు మంగళహారతులు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం సదరు కుటుంబంతో కలిసి భోజనం చేశారు సీఎం. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు.

CM Revanth Reddy with Common Man

దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండడంతో కుటుంబానికి ఉపయోగకరంగా ఉందని సీఎం ఎదుట శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారితో ఫొటోలు దిగిన రేవంత్ రెడ్డి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున సారపాక గ్రామానికి చేరుకున్నారు. తమ అభిమాన నేతను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Minister Uttam Kumar Reddy: బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట స్వయంగా హాజరవుతా – మంత్రి ఉత్తమ్‌

Leave A Reply

Your Email Id will not be published!