CM Revanth Reddy : రెండు పదవులతో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి వైరల్
CM Revanth Reddy : తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మరో సవాల్ ఎదురైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి మరో నాలుగు నెలల పాటు కొనసాగుతుండడంతో తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన రేవంత్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఒకవైపు పార్టీ అధ్యక్షుడిగా, మరోవైపు ముఖ్యమంత్రిగా పార్లమెంటులో ఎక్కువ సీట్లు గెలవడమే రేవంత్ రెడ్డి ముందున్న పెద్ద సవాల్.
CM Revanth Reddy Busy Schedule
గత ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలుపొందడంతో ఇక్కడి లోక్‌సభ స్థానాలు ఆ పార్టీకి దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో పార్టీ బలహీనంగా ఉంది. అయితే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కష్టపడితే కొన్ని సీట్లు గెలిచే అవకాశం లేకపోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంక్రాంతి తర్వాత దావోస్ టూర్ ముగించుకుని పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు సీఎం. 15 సీట్లు గెలుచుకునేందుకు రేవంత్ కార్యాచరణ రూపొందించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులతో పాటు కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ హాజరుకానున్నారు. ఇందులో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి పార్టీ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పలు అంశాలపై అభిప్రాయాలు సేకరించి నివేదికను రూపొందించి రేపు ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో రేవంత్ సమర్పించనున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ ఇప్పటికే అన్వేషణ ప్రారంభించింది. కొంతమంది అభ్యర్థుల పేర్లతో సర్వేలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
Also Read : YSRCP 2nd List : 27 మంది కొత్త ఇంచార్జిలతో వైసీపీ సెకండ్ లిస్ట్