CM Revanth Reddy : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అదే ప్లేస్ లో..త్వరలో రానున్న సీఎం
ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది
Revanth Reddy : కుమారి ఆంటీ…ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. హైదరాబాదులోని కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఆమె తన స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో చాలా ప్రసిద్ధి చెందింది. యూట్యూబ్ చానెల్స్ బాగా ప్రమోట్ చేసాయి. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆమె వద్దకు ఫుడ్ ట్రై చేసేందుకు వచ్చేవారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ వంటకాలను తినడానికి ఆసక్తి చూపేవారు. దీంతో ఆ ప్రాంతంలో రద్దీ పెరిగింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని. కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఫ్లాట్ ఫారంపై ఫుడ్ విక్రయించడం అసాధ్యమని తేల్చిచెప్పారు. స్టాల్ ను వేరేచోటుకి మార్చుకోవాలని తేల్చిచెప్పారు. నా కడుపుకొట్టారంటూ వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ కోరింది.
Revanth Reddy Orders
ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి వెళ్ళింది. అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అదే స్థలంలో ఉండి యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపారు. ప్రజల పాలనలో… వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కుమారి ఆంటీ స్టాల్ను సందర్శించి భోజనాన్ని ఆస్వాదిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Also Read : Budget Session 2024 : రాష్ట్రపతి ఆధీనంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం