CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ మొదలు పెట్టిన తెలంగాణ సీఎం
ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల అని అన్నారు...
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభమైంది. గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా రేపటి (శుక్రవారం) నుంచి ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) మాట్లాడుతూ.. రూ.10 వేలతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైందని.. ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి.. రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నామన్నారు.
CM Revanth Reddy Comment
ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల అని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనే కల నెరవేరాలంటే సొంతు ఇళ్లు ఉండాలన్నారు. గుడిలేని ఊరు ఉండొచ్చేమోగానీ.. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదన్నారు. కూడు, గూడు, గుడ్డ అందరికీ అందాలనేదే కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అని చెప్పుకొచ్చారు. తొలిదశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. తొలిదశలో అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్ని స్పష్టం చేశారు. తొలిదశలో ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వానికి విపక్షాలు సూచనలు ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేదని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారన్నారు. పాలక, ప్రతిపక్షాలు శత్రుపక్షాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఇరుపక్షాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందన్నారు. పెద్దమనిషిగా కేసీఆర్ సూచనలు చేయాలని హితువుపలికారు. ‘‘మాకేమీ భేషజాలు లేవు.. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. అవసరమైన సూచనలు చేయాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : Minister Konda Surekha : మరోసారి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు