CM Revanth Reddy : కేంద్రమంత్రికి 20 లక్షల ఇళ్లు కావాలంటూ వినతి ఇచ్చిన సీఎం

గిరిజన రైతులకు పీఎం కుసుమ్‌ పథకం కింద 1 లక్ష సౌరపంపులను కేటాయించాలని..

CM Revanth Reddy : ప్రధానమంత్రి ఆవాస యోజన (అర్బన్‌) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(Manohar Lal)కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కూడా కోరారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పీఎంఏవై-అర్బన్‌ పథకంతోపాటు పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖలపై సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy Comment

ఈ సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy), తెలంగాణ దేశంలోని పట్టణ జనాభాలో 8 శాతం ఉంటుందని తెలిపారు. పీఎంఏవై 2.0 పథకంలో తెలంగాణ తొలుత చేరిన రాష్ట్రమని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో మెట్రో కనెక్టివిటీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నందున, మెట్రో ఫేజ్‌-1 కింద ఆరు కారిడార్లను గుర్తించామని, వాటి నిర్మాణానికి 24,269 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. ఈ డీపీఆర్‌లను ఆమోదిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటి నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పురపాలికల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.55,652 కోట్ల ఆర్థికసాయం మంజూరుచేయాలని కోరారు. రాష్ట్రంలోని 65 శాతం భూభాగం పట్టణ పరిధిలో ఉన్న నేపథ్యంలో, తెలంగాణను రూ.లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా పలు ప్రాజెక్టులను కేంద్ర మంత్రికి వివరించారు.

మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని, 55 కిలోమీటర్ల కాలువలు, బాక్స్‌ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌, సమీప 27 పురపాలక సంస్థల పరిధిలో మురుగునీటి నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్‌ ప్లాన్‌ (సీఎ్‌సఎంపీ) రూపొందించినట్లు తెలిపారు.

అలాగే, వరంగల్‌ నగరంలో రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకం అమలు చేయాలని కూడా కోరారు. గిరిజన రైతులకు పీఎం కుసుమ్‌ పథకం కింద 1 లక్ష సౌరపంపులను కేటాయించాలని, 2,500 మెగావాట్ల సౌర విద్యుత్తును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుత్తు సరఫరా, నెట్‌వర్క్‌ బలోపేతానికి సంబంధించి 9 ప్రాజెక్టుల నివేదికలను సమర్పించారని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే, తెలంగాణ డిస్కమ్‌లను రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్డీఎస్‌ఎస్‌)లో చేర్చాలని, విద్యుత్తు సంస్థలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించినందుకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని అభినందించారు.

సమీక్ష సందర్భంగా, తెలంగాణలో పురపాలక శాఖ, హైదరాబాద్‌ అభివృద్ధిపై రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ను కేంద్రమంత్రి ఖట్టర్‌ తిలకించారు. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించి, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ నేస్తం, రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలపై చర్చించనున్నారు.

Also Read : Donald Trump : అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఆగ్రహం..538 వలసదారులు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!