CM Revanth Reddy : పీవీ అరుదైన ఆర్థికవేత్త – రేవంత్
ఆధ్యాత్మికవేత్తగా కితాబు
CM Revanth Reddy : హైదరాబాద్ – మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు అరుదైన ఆర్థిక వేత్తనే కాదని ఆధ్యాత్మిక వేత్త అని ప్రశంసలు కురిపించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). పీవీ జ్ఞాన భూమి దగ్గర నివాళులు అర్పించారు. సీఎం, మంత్రులు, దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు.
CM Revanth Reddy Comment
పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారు సీఎం. భారత దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో పీవీ నరసింహారావు ఆర్థికంగా సంస్కరణలు తీసుకు వచ్చాడని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచాడు పీవీ అని ప్రశంసలతో ముంచెత్తారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన తరుణంలో పీవీ నరసింహారావు దేవుడిలా ఆదుకున్నాడని కొనియాడారు.
పీవీ తెలుగు వారి కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వైనం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం కావాలని పిలుపునిచ్చారు. పీవీ లాంటి వ్యక్తి ఈ లోకంలో మళ్లీ పుట్టరంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : Chandra Babu Case : బాబు బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్