KP Choudhary : నిర్మాత కేపీ చౌద‌రి డ్ర‌గ్స్ కేసు విచార‌ణ

సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అరెస్ట్

KP Choudhary : హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కొత్త ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపాల‌ని స్ప‌ష్టం చేయ‌డంతో పోలీసులు దూకుడు పెంచారు. ఎక్క‌డా క‌నిపించ కూడ‌ద‌ని, ఎవ‌రైనా స‌రే ఉపేక్షించ వ‌ద్ద‌ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).

KP Choudhary Case Investigation

దీంతో హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ గా కొలువు తీరిన కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. డ్ర‌గ్స్ రహిత న‌గ‌రంగా త‌యారు చేస్తామ‌ని, ఇదే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా పోలీసులు దాడులు ముమ్మ‌రం చేశారు. సోదాలు చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీపీ. ఇదే స‌మ‌యంలో ఉక్కు పాదం మోపేందుకు రంగం సిద్దం చేశారు. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సినీ నిర్మాత కేపీ చౌద‌రి కేసులో విచార‌ణ ముమ్మ‌రం చేశారు.

ఈ కేసుపై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని , ఇందులో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ త్వ‌ర‌లోనే అరెస్ట్ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు సీపీ, యాంటీ డ్ర‌గ్స్ చీఫ్ .

Also Read : CM Revanth Reddy : పీవీ అరుదైన ఆర్థిక‌వేత్త – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!