CM Revanth Reddy : రైతు రుణమాఫీలో తెలంగాణ ఆదర్శం కావాలి

ఈనెలాఖరు నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు...

CM Revanth Reddy : తెలంగాణలో రైతు రుణమాఫీ పథకం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తొలివిడతలో రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 వేల కోట్లు జమ చేశామని వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రుణమాఫీ చెక్కులు అందజేశారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు( గురువారం) వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులనుద్దేశించి మాట్లాడారు.

CM Revanth Reddy Comment

ఈనెలాఖరు నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికే బ్యాంకులకు ఆర్థికశాఖ నగదు జమ చేసిందని తెలిపారు. మూడు దశల్లో రుణాల మాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. రెండో విడత రుణమాఫీకి రూ.8 వేల కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేసినట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఆగస్తు 15లోపు నగదు జమ చేస్తామని చెప్పారు. మూడో విడత రుణమాఫీకి రూ.15 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు వివరించారు. పాస్‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుందని ఉద్ఘాటించారు. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు.

‘‘కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. తొలి విడతలో రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ. తొలి విడత రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు జమ చేస్తున్నాం. రైతుల అప్పులు రూ.2 లక్షల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చాం. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తాం. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తాం.

రేషన్‌కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రుణమాఫీకి ప్రామాణికం పాస్‌ పుస్తకమే.. రేషన్‌కార్డు కాదు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. ప్రతి నెలా రూ.7వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబర్‌ 9. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా జన్మదినం డిసెంబర్‌ 9. డిసెంబర్‌ 9 అనేది మనందరికీ పండుగ రోజు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Also Read : MLA Harish Rao : ఇచ్చిన హామీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!