CM Revanth Reddy Tour : 14 రోజులు విదేశాలలో పర్యటించనున్న తెలంగాణ సీఎం
6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటి సంస్థలతో భేటీ కానున్నారు...
CM Revanth Reddy : పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయనున్నారు. ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు సైతం విదేశాలకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 వ తేదీన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. నేటి నుంచి 9 వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ , శాన్ ప్రాన్సిస్కో, నగరాల్లో పర్యటించనున్నారు. అమెరికాలో పలువురు వ్యాపార వేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం ఇవాళ నేరుగా న్యూయార్క్ వెళ్లనుంది. 4వ తేదీన న్యూజెర్సీలో ఓ కార్యక్రమం జరగనుంది. 5 వ తేదీన న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు.
CM Revanth Reddy America Tour
6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటి సంస్థలతో భేటీ కానున్నారు. 7న చార్లెస్ స్కాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించనున్నారు. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్ జెన్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. 9న గూగుల్ సినియర్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాకు సీఎం బృందం వెళ్లనుంది. 12న సియోల్‌లో యూయూ పార్మ, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్ట్స్‌టైల్ ఇండ్రస్టీ ప్రతినిధులతో సమావేశం కానుంది. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్‌తో భేటీ కానుంది.14న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. గడిచిన సారి విదేశాల పర్యటనతో నలబై వేల కోట్ల పెట్టుబడులను రేవంత్(CM Revanth Reddy) తీసుకొచ్చారు. ఈసారి యాబై వేల కోట్లు టార్గెట్‌గా సీఎం ఫారెన్ టూర్ కొనసాగనుంది.
ష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విదేశీ పర్యటనకు పయనమయ్యారు. పధ్నాలుగ రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో ఆయన పర్యటించనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు రేవంత్ బయలుదేరనున్నారు. అమెరికాలో ఆరు రోజుల పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు వెళ్తారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది.
Also Read : Harish Rao : సిద్దిపేట రిజర్వాయర్ అంశంపై మంత్రి ఉత్తమ్ కు లేఖ రాసిన మాజీ మంత్రి