CM Revanth Reddy : అన్నదాతల ఆందోళనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తేమశాతం, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
CM Revanth Reddy : తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని మండిపడుతున్నారు రైతులు. సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారన్నారు. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలంటూ పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. మిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారని.. తేమశాతం, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy Comment
రైతులనుఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సోమవారం మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
Also Read : Ponnam Prabhakar : మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం