DSC 2024 Notification: తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల !

తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల !

DSC 2024 Notification: తెలంగాణ రాష్ట్రంలో కొలువులు జాతర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి… గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను బుధవారం రద్దు చేసిన ప్రభుత్వం… 11,062 పోస్టులతో గురువారం కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 11,062 పోస్టుల్లో… స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, లాంగ్వేజ్ పండిట్స్ 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి. దీనితో ప్రభుత్వం డిఎస్సీ నోటిపికేషన్ విడుదల చేయడం పట్ల తెలంగాణా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

DSC 2024 Notification Updates

ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకారం…. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ డిఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని… కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

Also Read : TDP MLA : ఉండి టికెట్ పై ఇద్దరు నాయకుల చూపు..అధిష్టానం వరకు వెళ్లిన పంచాయతీ…

Leave A Reply

Your Email Id will not be published!