CM Revanth : కేసీఆర్ సర్కార్ పై విద్యుత్ కొనుగోళ్ల అంశంపై నిప్పులు చెరిగిన సీఎం

తెలంగాణ జనాభా ప్రకారం ఆస్తులు.. అప్పుల పంపకం జరిగిందన్నారు...

CM Revanth : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్‌ఎస్ సర్కార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ కొనగోళ్ల విషయంలో గత నిప్పులు చెరిగారు. సీఎం మాట్లాడుతూ…‘‘సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే.. ఆల్రెడీ చర్లపల్లి జైలులో అన్నట్లు ఉంది. ఈ సభ్యుడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. సత్య హరిచంద్రుడి వంశంలో పుట్టాం. ఆయన తర్వాత కేసీఆర్ అన్నట్లు.. విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ అడిగారు. ప్రభుత్వం ఆమోదించింది. జస్టిస్ నర్సింహారెడ్డిని నియమించడం జరిగింది. మాజీ సీఎం, మాజీ మంత్రులను విచారణకు వచ్చి వాదనని వినిపించే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టు కమిషన్ కొనసాగించల్సిందే అని.. చైర్మన్‌ను మార్చండి అని సూచించింది. ఇవ్వాళ సాయంత్రం విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌ను నియమిస్తాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

CM Revanth Comment

తెలంగాణ జనాభా ప్రకారం ఆస్తులు.. అప్పుల పంపకం జరిగిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పాటు సమయంలో ఉత్పత్తి చేసే సంస్థలు కొత్త రాష్ట్రంలో.. వినియోగం మహారాష్ట్రకు వెళ్ళడంతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొందన్నారు. మాజీ సీఎం అసెంబ్లీలో కట్టే పట్టుకొని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది అని చెప్పారని గుర్తుచేశారు. జైపాల్ రెడ్డి ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా.. వినియోగం ప్రాతిపదికన విభజన జరగాలని అలా అయితే తెలంగాణ ఇబ్బంది ఉండదు అని చెప్పారన్నారు. విభజన చట్టంలో, బిల్లులో లేని.. స్పీకింగ్ ఆర్డర్ జైపాల్ రెడ్డి విద్యుత్‌కు సంబంధించిన ఇప్పించడం జరిగిందన్నారు. జైపాల్ రెడ్డి కృషితో 53.64 శాతం తెలంగాణకు విద్యుత్ వాటా ఇప్పించారన్నారు. ‘‘ ఇక్కడ ఉన్న పికుడుగాడు ఇవ్వడు అది చేయలేదు’’ అని విమర్శించారు.

కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అని…తాను తెలుగు దేశంలో ఉన్నప్పుడు వాస్తవాలను వివరించడం జరిగిందన్నారు. మార్షల్‌తో తనను బయట పడేయించారని ఆనాటి విషయాలను గుర్తుచేశారు. తెలంగాణను విద్యుత్ సంక్షోభం నుంచి జైపాల్ రెడ్డి, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ బయట పడేశారన్నారు. ఏడు వేల యూనిట్ల ఉత్పత్తి నుంచి 19 వేల ఉత్పత్తి చేశామని సిగ్గు లేకుండా చెబుతున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వానికి రూపాయి ఖర్చూ లేకుండా ఏర్పాటు జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పందాలు జరిగితే కమిషన్‌లు ఎలా వస్తాయి అంటున్నారన్నారు. ఎక్కడ నొక్కారు.. ఎక్కడ పొక్కారు అనేది తెలుసన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. తెలివితో డైరెక్ట్‌గా బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. విచారణకు ఇస్తే.. ఎందుకు గుండెలు గుద్దుకుంటున్నారు.. బాధపడుతున్నారని ప్రశ్నించారు.

సివిల్ కాంట్రాక్టులు అన్ని వీళ్ళ బినామీలకు ఇచ్చారని విమర్శించారు. కంకర నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు.. వీళ్ళ సంబంధీకులకు కట్టబెట్టారని ఆరోపించారు. 2400 మెగా వట్ల విద్యుత్‌కు టెండర్లు పిలుస్తే.. బీహెచ్‌ఈఎల్ ఇతర కంపెనీలు పాల్గొన్నాయన్నారు. అదే తేదీ జార్ఖండ్‌లో 18 శాతం తక్కువకు 2400 వందల మెగా వాట్ల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవచ్చు.. అనేది వాళ్ళు, వాళ్ళ గురువు చేసి చూపెట్టారన్నారు. సబ్ క్రిటికల్‌లో విద్యుత్ తక్కువ.. బూడిద ఎక్కువ వస్తుందన్నారు. సూపర్ క్రిటికల్‌లో విద్యుత్ ఎక్కువ.. బూడిద తక్కువ వస్తుంది అని మన్మోహన్ సింగ్ పక్కాగా చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) సభలో పేర్కొన్నారు.

Also Read : Ravi Moun : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ హర్యానా వాసి దుర్మరణం

Leave A Reply

Your Email Id will not be published!