Shinde Wife Slams : సంజయ్ రౌత్ ను ఆస్పత్రిలో చేర్చండి
శ్రీమతి షిండే షాకింగ్ కామెంట్స్
Eknath Shinde Wife : మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే సతీమణి సీరియస్ కామెంట్స్ చేశారు శివసేన బాల్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ పై. ఆయన గత కొంత కాలం నుంచి మతి చెడి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. తన కుమారుడు సంజయ్ రౌత్(Sanjay Raut) ను ఎందుకు చంపాలని అనుకుంటారంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని పేర్కొన్నారు. వెంటనే సంజయ్ రౌత్ మానసిక స్థితి బాగోలేదని , వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు.
గురువారం మహిళల తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తనకు ప్రాణ హాని ఉందని వెంటనే రక్షణ కల్పించాలని కోరుతూ లేఖ రాశారు సంజయ్ రౌత్ డీజీపీకి. దీనిని తేలికగా కొట్టి పారేశారు రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
ఇదే సమయంలో ఆయన చేసిన ఆరోపణలన్నీ ఉత్తవేనని పేర్కొన్నారు. కేవలం ప్రచారం కోసం చేస్తున్న డ్రామాగా కొట్టి పారేశారు. ఇదే సమయంలో సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని, ఇందుకోసం ఒకరికి కాంట్రాక్టు కూడా ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్.
దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం షిండే. ఈ మేరకు కోర్టులో రౌత్ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా శ్రీమతి షిండే(Eknath Shinde Wife) చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించారు ఎంపీ సంజయ్ రౌత్.
Also Read : పవన్ ఖేరా అరెస్ట్..కాంగ్రెస్ ఫైర్