CM Siddaramaiah: ముడా కేసులో కర్ణాటక సీఎం దంపతులకు హైకోర్టు నోటీసులు
ముడా కేసులో కర్ణాటక సీఎం దంపతులకు హైకోర్టు నోటీసులు
CM Siddaramaiah : మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ భూముల కేటాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా చీఫ్ జస్టిస్ ఎన్‌వి అంజారియా, జస్టిస్ కెవి అరవింద్ తో కూడిన డివిజన్ బెంచ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఇతరులకు నోటీసులు జారీచేసింది. ఈనెల 28వ తేదీలోగా నోటీసులకు జవాబివ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ అదే తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
CM Siddaramaiah Family Got Notices
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే సీఎం సిద్ధరామయ్యపై ఉన్న అభియోగం. సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీఎంపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. దీనితో ప్రస్తుతం లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్లు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఎన్‌వి అంజారియా, జస్టిస్ కెవి అరవింద్ తో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారణ జరిపి సీఎం, ఆయన భార్య పార్వతికి నోటీసులు పంపింది. ఈనెల 28వ తేదీలోగా నోటీసులకు జవాబివ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ అదే తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read : Supreme Court: వక్ఫ్ చట్టంపై నమోదైన పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు