CM Siddaramaiah : బియ్యం పంపిణీపై కేంద్రం వివ‌క్ష‌

కేంద్ర హొం మంత్రికి సీఎం ఫిర్యాదు

CM Siddaramaiah : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఆరు నూరైనా స‌రే అన్నా భాగ్య ప‌థ‌కం కింద బియ్యాన్ని పంపిణీ చేస్తామ‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుండి రావాల్సిన బియ్యాన్ని నిలిపి వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.

ఈ మేర‌కు సీఎం నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఎఫ్‌సీఐ బియ్యాన్ని నిలిపి వేశార‌ని, త‌మ రాష్ట్రంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా ఇలాగే జ‌రిగింద‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని షాకు తెలియ చేయ‌డంతో ఆయ‌న వెంట‌నే స్పందించారు.

త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్కారం అయ్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు సీఎం సిద్ద‌రామ‌య్య‌(CM Siddaramaiah). ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఐదు గ్యారెంటీ స్కీంల‌ను ప్ర‌వేశ పెట్టింది. వాటిలో అన్న భాగ్య ఒక‌టి. బీపీఎల్ కుటుంబాల‌కు నెల‌కు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయ‌డం. కేంద్రం అడ్డు కోవ‌డంతో బియ్యం పంపిణీ ఆల‌స్యం అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తంగా సీఎం చొర‌వ‌తో స‌మ‌స్య కొలిక్కి వ‌చ్చిన‌ట్ల‌యింది.

Also Read : CM Siddaramaiah : బియ్యం పంపిణీపై కేంద్రం వివ‌క్ష‌

 

Leave A Reply

Your Email Id will not be published!