CM Siddaramaiah : రేపు తుంగభద్ర డ్యామ్ ను సందర్శించనున్న కర్ణాటక ముఖ్యమంత్రి
గేట్ తెగే సమయంలో డ్యామ్‌లో 104.182 టీఎంసీల నీటి నిల్వ ఉంది...
CM Siddaramaiah : రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) సందర్శించనున్నారు. నీటి ఉధృతికి కొట్టుకపోయిన గేటు కోసం డ్యామ్ పరిసరాల్లో గజ ఈత గాళ్లతో వెదికిస్తున్నారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేయిస్తున్నారు. గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలు ప్రతినిధులు మరమ్మతు పనులు చేయించారు. వరద పెరిగిన కారణంగా జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టర్ ఇంతియాజ్ బాషా సూచించారు.
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(Tungabhadra Dam) (టీబీ డ్యామ్) ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. డ్యామ్‌కి అమర్చిన 19వ క్రస్ట్‌గేట్ చైన లింక్ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో ఆందోళన ప్రారంభమైంది. గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్‌లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్‌లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్‌గేట్ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్‌కి మొత్తం 33 క్రస్ట్‌గేట్లు ఉన్నాయి. ఇందులో 19వ గేట్‌కు ఉండే చైనలింక్ తెగిపోయింది. దీంతో గేట్ జారి కిందకు పడిపోయింది. గేటు డ్యామ్‌లోకి పడిపోయిందా, నదిలోకి కొట్టుకొచ్చిందా అనేది నీటి ప్రవాహం తగ్గితేనే తెలుస్తుందని బోర్డు వర్గాలు అంటున్నాయి.
CM Siddaramaiah to Visit
గేట్ తెగే సమయంలో డ్యామ్‌లో 104.182 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో వచ్చేసి ఆ సమయంలో 36,739 క్యూసెక్కులు వస్తుండగా.. 54,960 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. డ్యామ్ 33 గేట్లను అడుగు మేర ఎత్తి నదికి నీరు వదులుతున్న సమయంలో శనివారం రాత్రి 19వ క్రస్ట్‌గేట్‌ను మరో అడుగు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో క్రస్ట్ గేట్‌కు ఉండే ఒక చైన లింక్ కట్ అయింది. నీటి ఉధృతికి మరో చైన్ లింక్ కూడా తెగిపోయింది. గేట్ కనిపించకుండా నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్నిగేట్లు ఎత్తి నీరు నదికి వదిలారు. మిగిలిన 32 గేట్లు 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి నదికి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లోని నీటిలో 65 టీఎంసీలుపోనూ నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే క్రస్ట్‌గేట్ అమర్చేందుకు వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇన్‌ఫ్లోతోపాటు డ్యామ్‌లోని నీరు అంతా నదికి వదులుతున్నారు. 65 టీఎంసీల నీరు కిందకు వెళ్లడానికి కనీసం మూడు రోజులు పడుతుందని బోర్డువర్గాలు తెలిపాయి.
Also Read : CM Revanth Tour : అమెరికా పర్యటన అనంతరం సౌత్ కొరియా కు సీఎం రేవంత్ రెడ్డి