CM Yogi Comment : ఎన్ కౌంటర్ల వేట గుండెల్లో దడ
అతిక్ అహ్మద్..అష్రఫ్ కాల్చివేత
CM Yogi Comment : ఉత్తర ప్రదేశ్ లో నేరస్తులు, గ్యాంగ్ స్టర్లకు ఇప్పుడు వణుకు మొదలైంది. కరడు గట్టిన నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు ప్రయాగ్ రాజ్ లో కాల్చి చంపబడ్డారు. రెండు రోజుల కిందట రాజ్ పాల్ హత్య కేసులో కీలక నిందితుడైన అతిక్ అహ్మద్ కొడుకు అష్రఫ్ అహ్మద్ తో పాటు సహచరుడు గులాం లు ఎన్ కౌంటర్ లో ఖతమయ్యారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటికే పేరు మోసిన క్రిమినల్స్ , గ్యాంగ్ స్టర్స్ పారి పోవడమో లేక లొంగి పోవడమో చేస్తున్నారు. తమను చంప వద్దంటూ కోరుతున్నారు. మరికొందరు తమంతట తామే పోలీస్ స్టేషన్లకు వస్తున్నారు. ఇక అసెంబ్లీ సాక్షిగా సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Comment) కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ హెచ్చరించారు. ఆ వెంటనే క్రిమినల్స్ ఎన్ కౌంటర్లలో చంపబడ్డారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎస్పీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.
యూపీలో యోగి సర్కార్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లలో ఇప్పటి దాకా 183 మంది నేరస్థులు ఖతమయ్యారు. మార్చి 217 నుండి ఎన్ కౌంటర్లలో మరణించిన 13 మంది పోలీసులలో ఎనిమిది మంది కాన్పూర్ లోని ఇరుకైన సందులో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే సహాయకులు మెరుపు దాడికి పాల్పడ్డారు.
యోగి ఆరేళ్ల పాలనలో 183 మంది నేరస్థులను కాల్చి చంపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10,900 కు పైగా పోలీస్ ఎన్ కౌంటర్లు జరగడం విశేషం. 23,300 మంది నేరస్థులు అరెస్ట్ అయ్యారు. 5,046 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో గాయపడిన పోలీసుల సంఖ్య 1,443 కాగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఎన్ కౌంటర్లలో చాలా బూటకమని ఆరోపించాయి ప్రతిపక్షాలు. వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
వీరి కామెంట్స్ ను తేలికగా తీసి పారేశారు సీఎం. లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి ప్రాబ్లం లేదని ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రంలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ చేసిన వార్నింగ్ కు తగ్గట్టుగానే ఎన్ కౌంటర్లు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా మీరు నేరం చేయక పోతే మిమ్మల్ని ఎవరూ టచ్ చేయరు. ఒక వేళ నేరానికి పాల్పడితే ఎవరూ శిక్ష నుంచి చట్టం నుంచి తప్పించు కోలేరంటూ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏ కులానికి చెందిన వారైనా ఏ పార్టీ వారైనా నేరం చేస్తే లేపేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం ఆదిత్యానాథ్(CM Yogi). ఏ పోలీసులైతే నేరస్థులకు సపోర్ట్ గా నిలిచారో వారి చేతుల్లోంచే నేరస్థులు, గ్యాంగ్ స్టర్స్ ను లేకుండా చేసే పవర్స్ ఇవ్వడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా సీఎం యోగినా మజాకా అంటున్నారు.
Also Read : గ్యాంగ్ స్టర్ల హత్య జర్నలిస్టులకు భద్రత