YS Jagan : అప‌ర చాణక్యుడు అజాత శ‌త్రువు

రోశ‌య్య‌కు ఏపీ అసెంబ్లీ నివాళి

YS Jagan  : అప‌ర చాణ‌క్యుడు అజాత శ‌త్రువు రోశ‌య్య అని ఏపీ అసెంబ్లీ కొనియాడింది. ఆయ‌న మ‌ర‌ణం రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని లోటు అని పేర్కొన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌లో భాగంగా కొణిజేటి రోశ‌య్య మృతిపై సంతాప తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

విద్యార్థి స్థాయి నుంచే ఆయ‌న ఎదిగార‌ని పేర్కొన్నారు. విద్యార్థి నాయ‌కుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, సీఎంగా , చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ గా ఇలా అనేక ఉన్న‌త‌మైన ప‌ద‌వులు చేప‌ట్టార‌ని కొనియాడారు.

త‌న జీవితం అంతా ప్ర‌జా సేవ‌కు అంకితం చేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. ఆయ‌న మృతితో గొప్ప నాయ‌కుడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఆయ‌న ప‌ద‌వి చేప‌ట్టినా ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చేలా చేశార‌ని చెప్పారు.

ఆర్థిక శాఖా మంత్రిగా ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టి చ‌రిత్ర సృష్టించార‌ని తెలిపారు. ఐదుగురు ముఖ్య‌మంత్రుల వ‌ద్ద ప‌ని చేసిన అనుభవం రోశ‌య్య‌ద‌న్నారు(YS Jagan )జ‌గ‌న్ రెడ్డి.

నాన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆర్థిక మంత్రిగా ప‌ని చేశార‌ని, వారిద్ద‌రి మ‌ధ్య మంచి సంబంధాలు ఉండేవ‌న్నారు.

ఏరికోరి ఆయ‌న‌కు ఫైనాన్స్ ప‌ద‌వి క‌ట్ట బెట్టార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. మృతి చెందిన మాజీ స‌భ్యులంద‌రికీ రెండు నిమిషాలు మౌనం పాటించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై చీఫ్ విప్ శ్రీ‌కాంత్ రెడ్డి ధ‌న్య‌వాద తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టారు.

Also Read : విజ‌య‌సాయి రెడ్డికి కాపు జేఏసీ స‌త్కారం

Leave A Reply

Your Email Id will not be published!