Coco Gauff Record : చ‌రిత్ర సృష్టించిన కోకో గౌఫ్

అతి పిన్న వ‌య‌స్సు క్రీడాకారిణి

Coco Gauff Record : ఫ్రెంచ్ ఓపెన్ 2022లో అరుదైన ఘ‌న‌త చోటు చేసుకుంది. కేవ‌లం 18 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన క్రీడాకారిణిగా చ‌రిత్ర సృష్టించింది. ఆమె గ్రాండ్ స్లామ్ ఫైన‌లిస్ట్ గా చేరింది.

కోకో గౌఫ్ 2001 సంవ‌త్స‌రం త‌ర్వాత 21 ఏళ్ల త‌ర్వాత త‌క్కువ వ‌య‌స్సులో ఫైన‌లిస్ట్ గా ఇగా స్విటెక్ తో త‌ల‌ప‌డ‌నుంది. అంతే కాదు ఆమె సెమీస్ లో గెలిచిన అనంత‌రం సంచ‌ల‌నంగా మారారు.

టీవీ కెమెరాపై కొన్ని వ్యాక్యాల‌ను రాశారు. అదేమిటంటే తుపాకులు కాదు కావాల్సింది శాంతి కావాల‌ని కోరారు. ప్ర‌స్తుతం కోకో గౌఫ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేసింది.

కోకో గౌఫ్(Coco Gauff Record) కు యావ‌త్ క్రీడా లోకం స‌లాం చేస్తోంది. ఒక వేళ ఫైన‌ల్ లో గ‌నుక గెలిస్తే అరుదైన చ‌రిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ గా నిలిచి పోతుంది.

ఇక గ్రాండ్ స్లామ్ విష‌యానికి వ‌స్తే 2004లో త‌క్కువ వ‌య‌సులో మ‌రియా ష‌ర‌పోవా వింబుల్డ‌న్ విజేత‌గా నిలిచింది.

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా రోలాండ్ గారోస్ లో గురువారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ లో సెమీ ఫైన‌ల్ లో 18 ఏళ్ల అమెరిక‌న్ టెన్నిస్ క్రీడాకారిణి కోకో గౌఫ్(Coco Gauff Record) ఇట‌లీకి చెందిన మార్టినా ట్రెవిస‌న్ ను ఓడించింది.

త‌న తొలి గ్రాండ్ స్లామ్ ఫైన‌ల్ లోకి దూసుకు వెళ్లింది. ఆమె ట్రెవిస‌న్ ను 6-3, 6-1 వ‌రుస సెట్ల తేడాతో మ‌ట్టి క‌రిపించింది. యావ‌త్ అమెరిక‌న్ ప్ర‌పంచం కోకో గౌఫ్ చేసిన విన్న‌పాన్ని హ‌ర్షించింది.

Also Read : తుపాకులు కాదు శాంతి కావాలి – కోగో గౌఫ్

Leave A Reply

Your Email Id will not be published!