Munawar Faruqui : కామెడీ ఇప్పుడు లీగల్ గా మారింది
స్టాండ్ అప్ కమెడియన ఫారూఖి
Munawar Faruqui : భారతీయ స్టాండ్ అప్ కమెడియన్ గా పేరొందిన మునావర్ ఫారూఖీ(Munawar Faruqui) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ను టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ స్వంతం చేసుకున్నాడు. కీలకమైన టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించాడు. ఈ నిర్ణయం ట్విట్టర్ లో కలకలం రేపింది. దీనిపై ఫారూఖీ పూర్తిగా భిన్నంగా పేర్కొన్నాడు.
2021లో ఫరూఖీ అరెస్ట్ అయ్యాడు. అతని కామెడీలో మత పరమైన మనోభావాలను దెబ్బతీసిన ఆరోపణలపై ఒక నెల రోజుల పాటు జైలు జీవితం గడిపాడు.
మీరు నా బెయిల్ కోసం రారు అంటూ ఎలోన్ మస్క్ రాసినట్లు హాస్య నటుడు పేర్కొన్నాడు. ఈ సందర్బంగా కామెడీ (హాస్యం) ఇప్పుడు ట్విట్టర్ (పిట్టకొంచెం) లో చట్ట బద్దమైనది అంటూ స్పష్టం చేశాడు.
కామెడీ అన్నది జీవితంలో ఒక భాగంగా మారిందని తెలిపాడు. ఇదిలా ఉండగా ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకోవడం భారత దేశంలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. రాహుల్ గాంధీ ఖాతా తారుమారుని ఎలోన్ మస్క్(Elon Musk) పరిశీలిస్తారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆశించారు.
మునావర్ ఫరూఖీ కూడా ట్విట్టర్ లో కామెడీ చట్ట బద్దమైనదని ఎలోన్ మస్క్ చేసిన ప్రకటనపై వ్యాఖ్యానించడంతో ఈ జాబితాలో చేరాడు. నిజంగానా మస్క్ భాయ్ వద్దు వదిలేయండి..
నా బెయిల్ కోసం మీరు రారు అంటూ పేర్కొన్నారు మునావర్ ఫరూఖీ. హిందూ మత సమూహాల నుండి వ్యతిరేకత , బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి.
వారు హాస్య నటుడిని హిందూ మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఎలాన్ మస్క్ కామెడీ ట్వీట్ గురించి చెప్పాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఆమె తన మునుపటి ట్వీట్లలో ఒకటి మునుపటి ట్విట్టర్ యజమాని ద్వారా తొలగించబడింది కూడా. ఇప్పుడు హాస్యం కూడా చట్టబద్దమైనదని ఎలోన్ మస్క్ పేర్కొనడాన్ని మునావర్ ఫరూఖీ ప్రస్తావించాడు.
Also Read : రాహుల్ గాంధీకి స్వర భాస్కర్ కితాబు