Congress Announce : మహిళలకు బస్సుల్లో ఫ్రీ – కాంగ్రెస్
అధికారంలో వస్తే అమలు చేస్తాం
Congress Announce : కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తాము మరోసారి పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ(Congress Announce) మాత్రం హామీల జల్లులు కురిపిస్తోంది. ఇప్పటికే మహిళలే టార్గెట్ గా గృహ లక్ష్మి , గృహ విద్యుత్ పథకాన్ని తీసుకు వస్తామని ప్రకటించింది. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది.
తాము గనుక అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తిరిగే బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దీంతో ఆ పార్టీ మహిళలు, యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ ఇంఛార్జ్ రణ్ దీప్ సూర్జే వాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దీంతో అదనపు బలం చేకూరింది పార్టీకి. ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సతీమణి శనివారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమె ఎవరో కాదు కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప కూతురు. మొత్తంగా కాంగ్రెస్ కు ఈసారి ఎడ్జ్ ఉందని అనిపిస్తోంది.
Also Read : మహిళా రెజ్లర్లకు మాలిక్ మద్దతు