Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల !

39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల !

Congress First List: లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్(Congress) పార్టీ స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మరియు డాక్టర్ శశి థరూర్ వంటి హై ప్రొఫైల్ పేర్లు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వీటిలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. బిజెపి తొలి జాబితాను విడుదల చేసిన దాదాపు వారం తరువాత… కాంగ్రెస్ పార్టీ తన జాబితాను శుక్రవారం ప్రకటింది.

Congress First List – మొదటి జాబితాలో 39 మంది అభ్యర్ధులు వీరే !

తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు

1. జహీరాబాద్- సురేష్ కుమార్ షెట్కార్

2. చేవెళ్ల- సునీత మహేందర్

3. నల్గొండ- రఘువీర్ కుందూరు

4. మహబూబాబాద్ (ఎస్టీ)- బలరాం నాయక్ పోరిక
అయితే, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ వంశీచందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 

కేరళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు

1. కాసరగోడ్- రాజ్మోహన్ ఉన్నితన్

2. కన్నూర్- కె. సుధాకరన్

3. వడకర- షఫీ పరంబిల్

4. వయనాడ్- రాహుల్ గాంధీ

5. కోజికోడ్- M.K. రాఘవన్

6. పాలక్కాడ్- వి.కె. శ్రీకందన్

7. అలత్తూర్ (SC)-శ్రీమతి. రమ్య హరిదాస్

8. త్రిశూర్- కె. మురళీధరన్

9. చాలకుడి- బెన్నీ బహన్నన్

10. ఎర్నాకులం- హైబీ ఈడెన్

11. దుక్కీ- డీన్ కురియకోస్

12. మావెలిక్కర (SC)- కొడికున్నిల్ సురేష్

13. పాతనంతిట్ట- ఆంటో ఆంటోని

14. అట్టింగల్- అదూర్ ప్రకాష్

15. తిరువనంతపురం- డాక్టర్ శశి థరూర్

కర్ణాటక నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు

1. బీజాపూర్ (SC)- H.R. అల్గూర్ (రాజు)

2. షిమోగా- శ్రీమతి. గీతా శివరాజ్‌కుమార్

3. హాసన్- ఎం. శ్రేయాస్ పటేల్

4. తుమకూరు- ఎస్పీ ముద్దహనుమేగౌడ

5. మాండ్య- వెంకటరామెగౌడ (నక్షత్రం చంద్రు)

6. బెంగళూరు రూరల్- డి కె సురేష్

ఛత్తీస్‌గఢ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు

1. జంగీర్ – చంపా (SC)- డా. శివకుమార్ దహరియా

2. కోర్బా- శ్రీమతి జ్యోత్సానా మహంత్

3. రాజ్‌నంద్‌గావ్- భూపేష్ బఘేల్

4. దుర్గ్- రాజేంద్ర సాహు

5. రాయ్‌పూర్- వికాస్ ఉపాధ్యాయ్

6. మహాసముంద్- తార్ధ్వజ్ సాహు

Also Read : Kalvakuntla Kavitha : ముఖ్యమంత్రి రేవంత్ రేసుగుర్రం కాదు గుద్ది గుర్రంలా కనిపిస్తున్నారు

Leave A Reply

Your Email Id will not be published!