Congress Lashes : పోలీసుల నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం
రాహుల్ గాంధీని ప్రశ్నించడంపై ఫైర్
Congress Lashes : ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆదివారం రాహుల్ గాంధీ నివాసం వద్దకు వచ్చారని ఆరోపించింది. శ్రీనగర్ లో భారత్ జోడో యాత్రలో ప్రసంగిస్తూ లైంగిక వేధింపులకు గురైన వారి గురించి ప్రస్తావించారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వివరాలు కావాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇవాళ వివరాలు చెప్పాలని కోరారు.
ఇందుకు సంబంధించిన వివరాలు అందించేందుకు కనీసం 7 నుంచి 10 రోజుల సమయం పడుతుందన్నారు. ఇప్పటికే మార్చి 16న ఢిల్లీ పోలీసుల మరో బృందానికి చెప్పారని తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్ , అభిషేక్ సింఘ్వీ , జై రాం రమేష్ మీడియాతో మాట్లాడారు.
అధికార పార్టీ జోక్యం లేకుండా ఢిల్లీ పోలీసుల ఈ విధమైన చర్య అసాధ్యమన్నారు. దేశానికి స్వేచ్చ లభించి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటిది ఏనాడూ జరగలేదన్నారు. ఇది అత్యంత దారుణమని , అత్యంత అప్రజాస్వామికమని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు(Congress Lashes) . రాజకీయంగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు. ఇది ఒక రకంగా ఎమర్జెన్సీని గుర్తు చేసిందన్నారు.
పది రోజుల్లో సమాధానం ఇస్తానని చెప్పారు. అంతలో ఇంత తొందర ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. ఇందులో అశోక్ గెహ్లాట్ గుజరాత్ సీఎంగా ఉన్నారు. విద్వేష పూరిత రాజకీయాలకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రేమ సందేశం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.
Also Read : బీజేపీ ఓటమే తమ లక్ష్యం – అఖిలేష్